పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుల్వామా ఘటనను మోదీ ప్రస్తావించారు. భారత్లో అలజడులు సృష్టించాలన్న పొరుగు దేశం కుయుక్తులను సఫలం కానివ్వబోమని చెప్పారు మోదీ.
ఎవ్వరినీ వదలం: మోదీ - death toll reaches 40
పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్నవారెవరినీ విడిచిపెట్టబోమని హెచ్చరించారు ప్రధాని.
"ప్రపంచ దేశాలతో సంబంధాలు లేకుండా ఉన్న పాకిస్థాన్..ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడి భారత్లో అస్థిరత నెలకొల్పాలని భావిస్తోంది. అది సాధ్యం కాదని వారు గుర్తించాలి. 130 కోట్ల మంది భారతీయుల తరఫున దాయాది దేశం చర్యలకు దీటుగా బదులిస్తాం.. పెద్ద పెద్ద దేశాలు ఈ ఘటనలో భారత్కు మద్దతుగా నిలిచాయి. మానవతావాద శక్తులన్నీ ఏకమై తీవ్రవాద నిర్మూలనకు కృషి చేయాలి. అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఒకే జాతి, ఒకే నినాదం, ఒకే దిశలో ముందుకు సాగాలి"
-నరేంద్ర మోదీ, ప్రధాని