ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జమ్మూలో పాక్​కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు - pulwama blast

పుల్వామా ఘటనను ఖండిస్తూ పాకిస్థాన్​కు వ్యతిరేకంగా జమ్మూలో నిరసనలు వెల్లువెత్తాయి.

జమ్మూలో పాక్​కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు

By

Published : Feb 15, 2019, 3:40 PM IST

జమ్మూలో పాక్​కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు
40 మంది సీర్​పీఎఫ్​ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్థాన్​కు వ్యతిరేకంగా జమ్మూలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ప్రజలు. భారత్​లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న దాయాది దేశం పాకిస్థాన్​కు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

నిరసనల్లో భజరంగ్​దళ్, శివసేన, డోగ్రా ఫ్రంట్​ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉగ్ర చర్యను ఖండిస్తూ జమ్మూకశ్మీర్​ హైకోర్టు బార్​ అసోసియేషన్​ విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండించింది విశ్వ హిందూ పరిషత్​. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు జమ్ముూకశ్మీర్​ వీహెచ్​పీ కార్య నిర్వాహకాధికారులు.

జమ్మూకశ్మీర్​లో శుక్రవారం పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని భజరంగ్​దళ్ ప్రకిటించింది.

డోగ్రా సదర్ సభ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుల్చేన్​ సింగ్​ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

పలు కశ్మీర్​ పండిట్​​ సంస్థలు​ ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించాయి.

ABOUT THE AUTHOR

...view details