ETV Bharat / briefs
మళ్లీ బాబే అధికారంలోకి రావాలి: కేజ్రీవాల్ - విజయవాడ
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి చంద్రబాబే కారణమని దిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న ఆయన.. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ప్రశంసించారు.
విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
By
Published : Mar 28, 2019, 8:32 PM IST
| Updated : Mar 28, 2019, 10:15 PM IST
విజయవాడ ఉత్తరాది వాసుల ఆత్మీయ సభలో పాల్గొన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.. విజయవాడ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాల్లోనూ తెదేపాను గెలిపించాలని కోరారు. వచ్చే కేంద్ర ప్రభుత్వంలో తెదేపా పాత్ర ఉంటుందన్న కేజ్రీవాల్... జగన్‌కు ఓటేస్తే భాజపాకు ఓటేసినట్లే అనిపేర్కొన్నారు. కొత్త రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబే మళ్లీ రావాలని ఆకాంక్షించారు. Last Updated : Mar 28, 2019, 10:15 PM IST