రాష్ట్రంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్ జరపనున్నారు. ఎన్నికల సంఘం ఈ రాత్రికి రీపోలింగ్ తేదీలను ప్రకటించనుంది. వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎంల తరలింపుపై ఈసీ చర్యలకు సిద్దమైంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం కలనూతలలో అడ్జర్న్ పోలింగ్ నిర్వహించాలని ఈసీ సిఫారసు చేసింది.
రాష్ట్రంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్! - Re-poling
రాష్ట్రంలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్ జరిపే అవకాశం ఉంది.
రాష్ట్రంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్ స్లిప్పుల ఘటనపై కేసు నమోదు చేశారు. ఆత్మకూరు ఆర్వో, ఏఆర్‌వోతో పాటు... ఆర్డీవో చినరాముడు, తహసీల్దార్ విద్యాసాగరుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Apr 16, 2019, 11:59 PM IST