ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వెనుకబడిన వర్గాలకు తెదేపానే అండ: చంద్రబాబు - CM ELECTION CAMPAIGN IN ANANTHPURAM

వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేస్తామని అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు తెలిపారు. యువతను ఆదుకునే బాధ్యత నాదన్న సీఎం... జగన్‌ను నమ్ముకుంటే నేరాలు చేయించి జైలుకు పంపిస్తారని ఆరోపించారు. నేరస్థులకు కాపలాదారుగా ప్రధాని మోదీ పని చేస్తున్నారని విమర్శించారు.

అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

By

Published : Mar 27, 2019, 7:11 PM IST

అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండేందుకు 10 వేల కోట్ల రూపాయలతో 'ఈ బ్యాంకు' ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సీఎం...ఏప్రిల్‌ తొలివారంలో రైతులకు రుణమాఫీ నగదు వస్తుందన్నారు. కరవు సీమకు కియా మోటార్స్‌ తీసుకువచ్చిన ఘనత మాదేనన్న బాబు.. జాబు రావాలంటే మళ్లీ బాబురావాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవా నుంచి జిల్లాలోని చెరువులకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదన్న సీఎం... నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని తెలిపారు. తాగు, సాగునీరు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అనంతపురాన్ని దేశంలోనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని హార్టి కల్చర్ హబ్​గా మార్చి.. అన్ని ప్రాంతాల వారు ఇక్కడే ఉపాధి పొందేలా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details