విజయవాడ తూర్పు 48వ పోలింగ్ కేంద్రమైన లయోల కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు లైన్లలో ఉండగా ఈవీఎం మొరాయించాయని... ఓటింగ్ ప్రక్రియ నిలిపివేయడం వలన ఘర్షణ చోటు చేసుకుంది. వృద్ధులు, మహిళలు వేచి ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గంటల కొద్ది లైన్లో నిలబడలేక.. చాలా మంది ఓట్లు వేయకుండా తిరిగి వెళ్లిపోయారని ఎంపీ కేశినేని నాని సోదరి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంలు పని చేయడం లేదని చెప్పడం భావ్యం కాదన్నారు. పోలింగ్ రద్దు చేసి, మళ్లీ ఓటింగ్ నిర్వహించాలని కోరారు. కేంద్రం ఆడుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని ఆరోపించారు.
అధికారుల తీరును నిలదీసిన ఎంపీ కేశినేని నాని సోదరి - kesi nani
విజయవాడ తూర్పు 48వ పోలింగ్ కేంద్రమైన లయోల కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. ఓటర్లు లైన్లలో ఉండగా ఈవీఎం మొరాయించింది. ఓటింగ్ ప్రక్రియ నిలిపివేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది.
ఎంపీ కేశినేని నాని సోదరి