రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు భారీ సాయం - medical fecilities
రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రపంచ బ్యాంకు రుణం అందించనుంది. ఈ మేరకు కుదిరిన రుణ ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయి.
ఏపీలో వైద్యసేవల విస్తరణకు ప్రపంచ బ్యాంకు రుణసాయం
రాష్ట్రంలో వైద్యసేవల విస్తరణకు సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. రూ.2 వేల 266 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు.. ప్రపంచబ్యాంకుతో ఒప్పందంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంతో ఏపీలో వైద్యసేవలు మరింత మెరుగుపడతాయని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ రుణంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తామని వెల్లడిచింది.
Last Updated : Jun 28, 2019, 6:27 AM IST