ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

విశాఖలో వర్ష బీభత్సం... రోడ్లన్నీ జలమయం - విశాఖలో వర్షం

ఎండలతో మండిపోతున్న విశాఖ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వర్షానికి తోడైన ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్ష బీభత్సానికి రోడ్లన్నీ నీట మునిగాయి.

విశాఖలో వర్ష బీభత్సం...జలమయమైన రోడ్లు

By

Published : May 27, 2019, 10:15 PM IST

పగలంతా రోహిణీ కార్తె ఎండలతో ఉక్కపోతతో అల్లాడిన విశాఖ వాసులను వరుణుడు కరుణించాడు. నగరంలో సాయంత్రం ఒక్కసారిగా కమ్ముక్కున్న మేఘాలతో జనం ఊపిరి పీల్చుకున్నారు. చిన్నగా మొదలైన వర్షం...ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తీవ్రమైంది. నగరంలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంట వ్యవధిలో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి.

విశాఖలో వర్ష బీభత్సం...జలమయమైన రోడ్లు

ABOUT THE AUTHOR

...view details