జగన్కు సాయం చేసేందుకే మోదీ వస్తున్నారు! - BABU TWEET
వైకాపాకు సాయం చేసేందుకే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. ఇప్పుడు రాష్ట్రంలో ఏవిధంగా అడుగుపెడతారంటూ ట్వీట్ చేశారు.
వైకాపాకు సాయం చేసేందుకే ప్రధానిమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు ట్విటర్లో ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఏవిధంగా అడుగుపెడతారని ప్రశ్నించారు. విభజన గాయాలతో కుదేలైన ఏపీని ఆదుకుంటామని వెంకన్న సాక్షిగా మోదీ మాటిచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారుని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్థులతో మోదీ కుమ్మక్కై రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ మోదీ నిర్వీర్యం చేశారని.. విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదనీ ఆగ్రహించారు. ద్రోహులకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.