ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఇకనైనా.. విత్తన కొరత లేకుండా చూడండి: సోమిరెడ్డి - ap news

రాష్ట్రంలో తలెత్తిన విత్తన కొరతపై మాజీ మంత్రి సోమిరెడ్డి నెల్లూరులో స్పందించారు. కాంగ్రెస్​ హయాంలోని పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయని తెలిపారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి

By

Published : Jul 2, 2019, 8:57 PM IST

విత్తన కొరతపై స్పందించిన సోమిరెడ్డి


తెదేపా హయాంలో రైతులకు విత్తన కొరత లేకుండా చేశామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విత్తనాలు సకాలంలో అందించలేక తెదేపా పాలనపై నిందలేస్తున్నారన్నారు. కాంగ్రెస్​ పరిపాలనలోని పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్​ సమయంలోనూ.. వైకాపా అనధికారికంగా పెత్తనం చేసింది. సీఎస్‌ నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌ల వరకూ బ‌దిలీలు చేయించారన్నారు. అధికారుల‌తో స‌మీక్ష చేసుకునేందుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా విత్తనాలు సిద్ధం చేసి రైతుల‌కు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details