రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి..మరో వివాదం సంచలనమవుతోంది. అర్థరాత్రి 12 గంటలకుపోలింగ్ ముగిసినా... మరుసటి రోజు రాత్రి 9గంటలకు ఈవీఎంలు ఎన్నికల సంఘం అధికారుల చేతికి చేరడం వివాదాస్పదంగా మారింది.కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వెలుగూచూసిన ఈ ఘటన..కొత్త అనుమానాలకు తావిస్తోంది.
పెనమలూరులోని కానూరు పంచాయితీలో ఓ పోలింగ్ కేంద్రంతో పాటు...యనమలకుదురు,వణుకూరుల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల తరలింపు వ్యవహారం..తాజా వివాదానికి కారణమైంది.అర్థరాత్రి12గంటలకు పోలింగ్ ముగిస్తే..తెల్లారి రాత్రి9గంటలకు ఈవీఎంలు ఎన్నికల సిబ్బంది చేతికి అందాయి.వీటిని తీసుకునేందుకు తిరస్కరించిన ఎన్నికల సంఘం అధికారులు..రిటర్నింగ్ అధికారి ఇచ్చిన వివరణతో విస్తుపోయారు. 3రోజులుగా నిద్ర లేని కారణంగానే పొరపాటు జరిగిందనీ..అందుకే పడుకుని లేచిన అనంతరం ఈవీఎంలు అప్పగిస్తున్నామని సదరు అధికారి ఇచ్చిన వివరణ.. అధికారులను అయోమయానికి గురి చేసింది.
పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం303పోలింగ్ కేంద్రాలున్నాయి.ఎక్కడా ఈవీఎంలు మొరాయించిన ఘటనలు నమోదు కాలేదు.కేవలం2కంట్రోల్ యూనిట్లు,ఒక వీవీప్యాట్ నే మార్చాల్సి వచ్చింది.కానూరు పంచాయతీలో ఒక పోలింగ్ కేంద్రం,యనమలకుదురులో రెండు,వణుకూరులో ఒక పోలింగ్ కేంద్రంలో రాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది.పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రాన్ని.....సమీపంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు.స్ట్రాంగ్ రూంలు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు. 11వ తేదీ అర్థరాత్రి లోపే పోలింగ్ ముగిస్తే.. 12వ తేదీ రాత్రి9గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముకు వెళ్లాయి.ఈ అంశం తమ దృష్టికి రాలేదని..వచ్చిన తర్వాత ఈసీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై..ఎన్నికల సంఘం అధికారులు ఆరా తీస్తున్నారు.ఇప్పటికే నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.ఏఆర్వోగా ఉన్న నూజివీడు తహసీల్దార్ పి.తేజేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.