ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అన్నవరం దేవస్థానానికి 'ఐఎస్ఓ' గుర్తింపు - prasadam'

రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం దేవాలయానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ.ఎస్.​ఓ గుర్తింపు దక్కింది. సత్యదేవుని ప్రసాదం, ఆలయ సేవలకుగాను రెండు విభాగాల్లో ధ్రువీకరణ పత్రం లభించింది. హెచ్​.వై.ఎం ఇంటర్నేషనల్​ సర్టిఫికేట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఎండీ. శివయ్య సర్టిఫికెట్లను ఆలయ అధికారులకు అందించారు.

అన్నవరం దేవస్థానంకు ఐఎస్ఓ గుర్తింపు

By

Published : Apr 21, 2019, 8:47 PM IST

అన్నవరం ఆలయానికి ఐఎస్ఓ ధ్రువపత్రం
రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి ఐ.ఎస్​.ఓ (ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్​ ఆర్గనైజేషన్​) గుర్తింపు లభించింది. సత్యదేవుని ప్రసాదం, ఆలయ సేవలకుగాను..రెండు విభాగాల్లో హెచ్​. వై. ఎం. ఇంటర్నేషనల్​ సర్టిఫికేట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఎండీ శివయ్య ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దేవాలయం ప్రపంచ ఖ్యాతి గడించినందుకు ఆలయ ఛైర్మన్​ రోహిత్​, ఈవో సురేశ్​బాబులు ఆనందం వ్యక్తం చేశారు. గుడిలో అన్ని అంశాల్లో పాటించే ప్రమాణాలను పరిశీలించి సర్టిఫికెట్లు ప్రకటించామని శివయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details