అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని బాలవికాస్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖలో బాలవికాస్ పౌండేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం సభ్యులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. అమ్మ ఒడి పథకం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని బాలవికాస్ ఫౌండేషన్ నిర్వాహకుడు నర ప్రకాశరావు వ్యాఖ్యానించారు. పథకాన్ని ప్రైవేటు పాఠశాలకు వర్తింపచేస్తే ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించారు.
'అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే అమలు చేయాలి' - bala vikas
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అమలు చేయాలని బాలవికాస్ పౌండేషన్ నిర్వహకుడు నర ప్రకాశరావు కోరారు.
బాలవికాస్ ఫౌండేషన్ నిర్వాహకుడు నర ప్రకాశరావు