ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అమెజాన్​ బాస్​ సమాచారం లీక్.. - Jeff Bezos

తన వ్యక్తిగత సంక్షిప్త సందేశాలను (పర్సనల్​ మెసేజ్​) నేషనల్​ ఎంక్వైరర్​ ఆఫ్​ 'బ్లాక్​మెయిల్'​ ప్రచురించడంపై అమెజాన్​ సీఈఓ జెఫ్​ బెజోస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమేజాన్​

By

Published : Feb 8, 2019, 5:12 PM IST

Updated : Feb 9, 2019, 9:25 AM IST

ప్రపంచంలోని సుసంపన్నుల్లో ఒకరైన అమేజాన్​ సీఈఓకు అమెరికా మీడియాపై కోపమొచ్చింది. వ్యాఖ్యాత లారెన్​ సాంచెజ్​కు తనకి మధ్య జరిగిన వ్యక్తిగత సంక్షిప్త సందేశాలను (పర్సనల్​ మెసేజ్​) నేషనల్​ ఎంక్వైరర్​ ఆఫ్​ 'బ్లాక్​మెయిల్'​ ప్రచురించిన అంశంపై జెఫ్​ బెజోస్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎలా పొందారన్న అంశంపై సొంత దర్యాప్తునూ చేస్తామని తన బ్లాగ్​ వేదికగా పేర్కొన్నారు​. ఏఎంఐ పంపిన ఈమెయిల్స్​నూ బ్లాగ్​లో జతచేశారు అమెజాన్​ బాస్.

దర్యాప్తును ఆపకపోతే శాంచెజ్​తో దిగిన ఫోటోలనూ బయటపెడతామని అమెరికన్​ మీడియా చీఫ్​ కంటెంట్​ ఆఫీసర్​ తన న్యాయవాదికి హెచ్చరికలు పంపినట్లు బెజోస్​ తెలిపారు.

" సమాచార బహిర్గతంపై దర్యాప్తును ఆపాలని డేవిడ్​ పెక్కర్​ కు చెందిన ఎంక్వైరర్​ పబ్లిషర్​ అమెరికన్​ మీడియా(ఏఎమ్​ఐ) నన్ను సంప్రదించింది. దర్యాప్తును ఆపకపోతే వ్యక్తిగత ఫోటోలనూ ప్రచురిస్తామని హెచ్చరించింది. రాజకీయ నేతల ప్రోద్బలంతోనో లేదా రాజకీయ కుట్రతోనో ఇదంతా చేస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని బహిరంగ ప్రకటన చేయాలని కోరింది."
- జెఫ్ బెజోస్​, అమేజాన్​ సీఈఓ

ఈ వ్యవహారం వెనుక ఏవో రాజకీయ శక్తులున్నాయని జెఫ్​ బెజోస్​ భద్రత సలహాదారుడు గావిన్​ డీ బెక్కర్​ ఇటీవల డైలీ బీస్ట్​ ఇంటర్వూలో తెలిపారు.

" రాజకీయ శక్తులు ఇదంతా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మద్దతుదారుడైన సాంచెజ్​ తమ్ముడు మైఖేల్​పైనా అనుమానాలున్నాయి. "
-గావిన్ డీ బెక్కెర్​, జెఫ్​ బెజోస్​ భద్రతా సలహాదారులు

Last Updated : Feb 9, 2019, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details