అఖండ విజయంతో నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టిన వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్.. మంత్రి పదవుల కేటాయింపులో ఆచితూచి వ్యవహరించారు. రాష్ట్రంలో ముఖ్యమైన సామాజిక వర్గాల వారికి కేబినేట్ బెర్తులు ఖరారు చేశారు. మంత్రిమండలిలలో 25 మందికి చోటు కల్పిస్తూ... నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందంలోఅనుహ్యంగా... ముగ్గురు నానిలు స్థానం పొందారు. కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానితో పాటు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని.. మంత్రులు కాబోతున్నారు.
కొడాలి నాని
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని.. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజలకు సుపరిచితుడు. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో తెదేపా తరఫున గెలిచిన కొడాలి నాని, 2012లో వైకాపాలో చేరారు. 2014, 2019లలో వైకాపా నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీచేశారు. తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్‌పై గెలుపొందారు.
ఆళ్ల నాని