అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అగ్రిగోల్డ్ వినియోగదారుల సంక్షేమ సంఘం స్వాగతించింది. బాధితులకు 1150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 300 మంది అగ్రిగోల్డ్ ఖాతాదారులు ఆత్మహత్యలు, అస్వస్థతతో చనిపోయారని,ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం స్పందించిందని... గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. బాధితులకు ప్రభుత్వం సత్వర చెల్లింపులు జరపాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తుల బహిరంగ వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని... భూముల్ని చిన్నచిన్న కమతాలుగా విభజించి వేలం వేస్తే బాధితులకు మరింత న్యాయం జరుగుతుందని చెప్పారు.
కేబినేట్ నిర్ణయానికి అగ్రిగోల్డ్ బాధితుల హర్షం - agrigold
అగ్రిగోల్డ్ బాధుతులను ఆదుకుంటామన్న..కేబినెట్ తీర్మానంపై గుంటూరు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.
కేబినేట్ నిర్ణయానికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం హర్షం