ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

లక్ష్యం సాధించింది.. ప్రాణం కోల్పోయింది! - police events

లక్ష్యాన్ని సాధించింది. జీవితాన్ని కోల్పోయింది. పోలీసు దేహ దారుఢ్య పరీక్షల పరుగును విజయవంతంగా పూర్తి చేసింది. కాసేపట్లోనే కుప్పకూలింది. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.

ఆఖరి పరుగు

By

Published : Feb 18, 2019, 11:43 AM IST

Updated : Feb 18, 2019, 11:49 AM IST

పోలీసు దేహ దారుఢ్య పరీక్షల్లో పరిగెత్తి కుప్పకూలింది.
పోలీసు దేహదారుఢ్య పరీక్షల్లో గుండెపోటుతో ఓ యువతి మృతి చెందింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వెలిచాలకు చెందిన కొండ మమత పోలీసు ఉద్యోగ కోసం శిక్షణ తీసుకుంది. పరీక్షల్లో భాగంగా 100 మీటర్ల పరుగులో అర్హత సాధించింది. కాసేపటికే కుప్పకూలింది. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉంటే అభ్యర్థులు ముందే సమాచారం ఇవ్వాలని సీపీ కమలాసన్ రెడ్డి కోరారు. అలాంటి వారికి మరో రోజు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. తగినంత ప్రాక్టీస్ లేకుండా హాజరు కావొద్దని అభ్యర్థులకు సూచించారు.
Last Updated : Feb 18, 2019, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details