తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయం ఎదుట ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత 25 ఏళ్లుగా భాజపాకు సేవలందిస్తున్నానని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన బండి శ్రీనివాస రావు తెలిపారు. కైకలూరు ఎంపీపీగా సేవలందించిన అతని భార్యను 2017లో అన్యాయంగా సస్పెండ్ చేశారని వివరించారు.
భాజపా కార్యాలయం ఎదుట వ్యక్తి ఆమరణ దీక్ష - ap news
గుంటూరు భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి.. పార్టీలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
![భాజపా కార్యాలయం ఎదుట వ్యక్తి ఆమరణ దీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3724057-420-3724057-1562070286246.jpg)
భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష
ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎంపీపీగా అవార్డొచ్చినా.. పార్టీ మాత్రం తమ సేవలను గుర్తించడం లేదని వాపోయారు. సామాన్యులకు భాజపాలో ఆదరణ కొరవడిందని ఆవేదన చెందారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించాలని కోరారు.తనకు న్యాయం జరిగే వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.
ఇవీ చదవండి...మోదీ పాలనపై నమ్మకంతోనే భాజపాలోకి వలసలు