ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆనాటి చారిత్రక గుర్తులు.. ఈనాటికీ సురక్షితంగా! - బ్రహ్మం గారి మఠం

300 ఏళ్ల నాటి చారిత్రక వస్తువులు, తాళపత్రాలు సురక్షితంగా భద్రపరుస్తూ నేటి తరానికి గత చరిత్రను తెలిపే ప్రయత్నం చేస్తోంది కడప జిల్లా కోనసముద్రంకు చెందిన ఓ కుటుంబం. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలైన ఈశ్వరమ్మకు చెందిన వస్తువులను భద్రపరిచి, పూజలు అందిస్తున్నారు.

ఆనాటి చారిత్రక గుర్తులు ఈనాటికీ సురక్షితంగా!

By

Published : Jun 25, 2019, 5:02 PM IST

ఆనాటి చారిత్రక గుర్తులు ఈనాటికీ సురక్షితంగా!
యోగ సమాధి పొందిన కాలజ్ఞాన గ్రంథకర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలు ఈశ్వరమ్మ బహుకరించిన వస్తువులను మూడు తరాలపాటు భద్రపరుస్తూ భావితరాలకు అందిస్తున్నారు కడప జిల్లా కోనసముద్రం గ్రామానికి చెందిన ఓ కుటుంబం. ఆనాటి చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ వస్తువులను...నేటి తరానికి తెలియజేస్తున్నారు. ఇలా భద్రపరుస్తున్న వస్తువులను ఏటా అనవాయితీగా ఉగాది పర్వదినాన బ్రహ్మంగారి మఠంలోని ఈశ్వరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి గ్రామానికి తీసుకొస్తుంటారు.

కడప జిల్లా బద్వేలు మండలంలోని కోనసముద్రం గ్రామంలో 300 ఏళ్ల కిందట మూగ సుబ్బయ్య అనే భక్తుడు ఉండేవాడు. ఈయన వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలైన ఈశ్వరమ్మ వద్ద శిష్యరికం చేసేవాడు. సుబ్బయ్య సేవలకు గుర్తింపుగా..ఈశ్వరమ్మ గుమ్మడి పండు, రుద్రాక్ష మాల, తాళపత్ర గ్రంథం, విభూది పండు అందజేశారు. మూగ సుబ్బయ్య ఈ వస్తువులను తన కుటుంబీకులకు అందించి...బ్రహ్మంగారిమఠంలో యోగ సమాధి పొందారు. ఆనాటి నుంచి వస్తువులను భద్రపరుస్తూ..భావితరాలకు చరిత్ర తెలియజేస్తోన్న వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details