13వ షెడ్యూలు అమలుపై కేంద్రహోంశాఖ ప్రత్యేక భేటీ
ఏపీ పునర్విభజన చట్టం అమలు మరోసారి తెరపైకి వచ్చింది. 13వ షెడ్యూల్‌లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష నిర్వహించింది.
ఏపీ పునర్విభజన చట్టం అమలు తీరుపై కేంద్రం హోంశాఖ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్ చౌహాన్ పునర్విభజన చట్టంతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులతో భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్, కరికాల వలవన్, దమయంతి, ఆలోక్యరాజ్, ప్రేమ్ చంద్రారెడ్డి, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, తెలంగాణ నుంచి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి సమావేశంలో పాల్గొన్నారు. విభజనచట్టంలోని 13వ షెడ్యూలు అమలుపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు.
TAGGED:
ap reorganisation act