ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 12 న సచివాలయంలో విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి బి. విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది మెుదటిసారిగా ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది మెుదటి సంవత్సరానికి అమలు చేయగా ఈసారి ద్వితీయ ఏడాదికి గ్రేడింగ్ విధానం అమలు చేస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభమైన పరీక్షలు మార్చి 18తో ముగిశాయి. ఫలితాలను www.eenadu.net. http// jnamabhumi.ap.gov.in // http// resultsapcfss.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
పోలింగ్ తర్వాత రోజే ఫలితాలు- ఒకటే ఉత్కంఠ - inter board
మెుదటిసారి గ్రెేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి తెలిపారు. మార్చి 12 న ఫలితాలు విడుదల కానున్నాయని ఓ ప్రకటన విడుదల చేశారు.
12 న ఇంటర్మీడియట్ ఫలితాలు