ఈ నెల 14న పదో తరగతి ఫలితాలు
మే నెల 14న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 14న పదో తరగతి ఫలితాలు
పదో తరగతి ఫలితాలను ఈ నెల 14వ తేదీన విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మార్కులు వచ్చాయని తెలిపిన విద్యాశాఖ...ఫలితాలు మంగళవారం విడుదల చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలల్లో 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 2,839 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరిగాయి.