పది పరీక్షల్లో 94.88 శాతం ఉత్తీర్ణత - బాలికలదే పైచేయి - undefined
పదో తరగతి పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. 95.09 శాతం ఉత్తీర్ణతతో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు.
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 94.88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. బాలురు 94.68 శాతం ఉత్తర్ణత పొందగా.... 95.09 శాతం ఉత్తీర్ణతతో బాలికలు పైచేయి సాధించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలవగా..... 83.19 శాతంతో నెల్లూరు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. జీపీఏ 10కి 10 పాయింట్లతో 33 వేల 9 వందల 72 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
TAGGED:
10th results