కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూలు కట్టారు. పోలింగ్ ప్రశాంతంగా నడిచేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అంతా సవ్యంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న 100 ఏళ్ల వృద్ధుడు - ఓటు హక్కు
కడప జిల్లా జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని కేంద్రాలలో ఈవీఎంల మొరాయింపుతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. ఓట్ల హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. గూడెంచెరువు గ్రామంలో 100 ఏళ్ల వృద్ధుడు వెంకటపతి ఓటు హక్కు వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
100 ఏళ్ల వయోవృద్ధుడు
వృద్ధులు ఓట్లు వేసేందుకు వీలుగా పోలింగ్ సిబ్బంది వారికి సహాయపడుతున్నారు. జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామంలో 100 సంవత్సరాలు వృద్ధుడు వెంకటపతి, 80 ఏళ్ల వయసున్న కేశవ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇవీ చూడండి :ఈవీఎంల మొరాయింపుపై ఈసీకి చంద్రబాబు లేఖ