చేజారిన సిరీస్.. - మహిళల క్రికెట్ జట్టు
2019-02-08 10:39:24
2-0 ఆధిక్యంలో కివీస్
న్యూజిలాండ్తో జరుగుతోన్న మహిళల టీ-20 సిరీస్ను కోల్పోయింది భారత్. ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిన భారత్ ఈ రోజు జరిగిన రెండో టీ-20లోనూ పరాజయం పాలైంది. ఫలితంగా, 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ దక్కించుకుంది కివీస్. నామమాత్రమైన మూడో టీ-20 ఫిబ్రవరి 10న జరగనుంది.
హోరాహోరీగా సాగిన పోరులో చివరివరకు ఉత్కంఠ రేకెత్తించింది. కివీస్ చివరి బంతికి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 72 పరుగులు చేసింది. కివీస్ సరిగ్గా 20 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సుజీ బేట్స్ 62 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు.