తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగ సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. పీయూష్ గోయల్‌పై కవిత్వం చెప్పి అందరినీ అలరించారు కేంద్రమంత్రి రామదాస్ ఆథవాలే.
అథవాలే తన ద్విపదలు, కవిత్వాలతో సహజంగా అందరినీ అలరిస్తుంటారు. పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తున్న సమయంలో అథవాలే అకస్మాత్తుగా లేచి కవిత్వం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.