ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

సీబీఐ విచారణకు సహకరించాల్సిందే : సుప్రీం - CBI

శారదా కుంభకోణ విచారణలో సీబీఐకి సహకరించాల్సిందేనని కోల్​కతా కమిషనర్​ను సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే రాజీవ్​ కుమార్​ను అరెస్ట్​ చేయరాదని సుప్రీం సూచించింది.

సీబీఐ విచారణ

By

Published : Feb 5, 2019, 12:05 PM IST

Updated : Feb 5, 2019, 2:10 PM IST

బంగాల్​ శారదా కుంభకోణంపై సుప్రీంకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. సీబీఐ తరపున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ వాదనలు వినిపించారు. కోల్​కతా పోలీసు కమిషనర్​ తరపున కాంగ్రెస్​ నేత అభిషేక్​ సింఘ్వీ వాదించారు.

శారదా కుంభకోణం విచారణలో సీబీఐకి సహకరించాల్సిందేనని కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయనను అరెస్ట్​ చేయరాదని సీబీఐకి సుప్రీం తెలిపింది.

సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​లో బంగాల్​ డీజీపీ, కోల్​కతా సీపీకి నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

సాక్ష్యాలను మాయం చేసేందుకు యత్నించారు

శారదా కుంభకోణంపై సుప్రీం కోర్టులో సీబీఐ ప్రమాణపత్రం​ దాఖలు చేసింది. దానిని కోర్టుకు వినిపించారు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు కోల్​కతా సీపీ యత్నించారని కోర్టుకు తెలిపారు ఏజీ. కోల్​కతా పోలీసులు నకిలీ కాల్​ రికార్డులను సమర్పించారని తెలిపారు.

కుంభకోణం విచారణకు నియమించిన సిట్​కు సీపీ రాజీవ్​ కుమార్​ నేతృత్వం వహిస్తున్నారని, ఎన్నిసార్లు అడిగినా సేకరించిన సాక్ష్యాలను ఇవ్వలేడం లేదని కోర్టుకు విన్నవించారు. కనీసం స్పందించడం లేదన్నారు. కుంభకోణంలో కొందరు పోలీసు అధికారులు, నేతలు ఉన్నట్టు ఆధారాల్లో ఉన్నాయని తెలిపారు.

అందుబాటులో ఉండాలి : సుప్రీం

శారదా కుంభకోణం విచారణ సందర్భంగా సీబీఐకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోల్​కతా పోలీసు కమిషనర్​ను సుప్రీం ఆదేశించింది. పూర్తి సహకారాన్ని అందించాలని స్పష్టీకరించింది.

విచారణ వాయిదా

శారదా కుంభకోణంపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం.

Last Updated : Feb 5, 2019, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details