ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

ఈడీ విచారణకు వాద్రా-తోడుగా ప్రియాంక - money laundering

రాబర్ట్​ వాద్రా లోపలికి వెళ్లిన కాసేపటికే ఈడీ కార్యాలయం నుంచి ప్రియాంక వెళ్లిపోయారు

రాబర్ట్​ వాద్రా

By

Published : Feb 6, 2019, 4:46 PM IST

ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చిన వాద్రా
మనీలాండరింగ్​ కేసులో కాంగ్రెస్​ అగ్రనేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్​ వాద్రాను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ విచారిస్తోంది. విదేశాల్లో అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ప్రశ్నిస్తోంది.

లండన్​లో స్థిరాస్తుల కొనుగోలు సహా ఇతర లావాదేవీలపై ఈడీ అధికారులు వాద్రాను విచారిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్​ నిరోధక చట్టం కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

ఇవీ ఆరోపణలు...

రాబర్ట్ వాద్రా లండన్​లో 1.9మిలియన్​ పౌండ్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం మనీలాండరింగ్​కు పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.

అక్రమాస్తుల కేసులో గతవారం వాద్రాకు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది. ఈడీ విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు నిర్దేశం మేరకు నేడు రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.

వాద్రాతో పాటు ఆయన భార్య ప్రియాంక కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. వాద్రా లోపలికి వెళ్లిన కాసేపటికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ABOUT THE AUTHOR

...view details