ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన సీమాంచల్​ ఎక్స్​ప్రెస్​ - జోగ్బానీ-ఆనంద్​ విహార్​ టర్మినల్

బిహార్​ వైశాలి జిల్లాలో సీమాంచల్​ ఎక్స్​ప్రెస్​ రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన 9 బోగీలు, ఆరుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

రైలు ప్రమాదం

By

Published : Feb 3, 2019, 7:36 AM IST

రైలు ప్రమాదం
బిహార్​లోని జోగ్బానీ-ఆనంద్​ విహార్​ టర్మినల్​ సీమాంచల్​ ఎక్స్​ప్రెస్​ ప్రమాదానికి గురైంది. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల 58 నిముషాల ప్రాంతంలో వైశాలి జిల్లాలో జరిగిన ఘటనలో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 6 గురు ప్రయాణికులు మరణించినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.

వైశాలి జిల్లా సహదాయ్​ బుజుర్గ్​ వద్ద ఓ జనరల్​ కోచ్​, ఓ ఏసీ కోచ్​, మూడు స్లీపర్​ క్లాస్​ కోచ్​లు, మరో నాలుగు కోచ్​లు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

సోనాపూర్​-06158221645, హాజీపుర్​-06224272230, బరౌనీ-06279232222 వద్ద రైల్వే అధికారులు హెల్ప్​లైన్​ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details