బంగాల్లో ఒక కవాతులో మాట్లాడిన ఆయన... కోల్కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ను కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.
''అవినీతి అధికారులకు మమత వత్తాసు'' - sharadha ponzi scam
సీబీఐ అధికారులను అడ్డుకున్న మమతా బెనర్జీ ..దీక్ష చేయటంపై భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో పర్యటించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శారదా కుంభకోణం విషయంలో దీదీపై ఆరోపణలు చేశారు.
"మమత అవినీతి అధికారులను కాపాడుతోంది"
పోలీసు అధికారులను మమతా బెనర్జీ ఎందుకు కాపాడాలనుకుంటుందో తెలపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చోవటం రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా చేస్తున్నారని యోగి విమర్శించారు.
Last Updated : Feb 6, 2019, 9:51 AM IST