ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

మధ్యంతర బడ్జెట్​ ట్రైలరే : ప్రధాని మోదీ - తాత్కాలిక బడ్జెట్​

సమ్మిళిత అభివృద్ధికి ఉపకరించేలా బడ్జెట్​ ఉందని అభిప్రాయపడ్డారు ప్రధాన మంత్రి.

ప్రధాని నరేంద్ర మోదీ

By

Published : Feb 1, 2019, 10:47 PM IST

మధ్యంతర బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాల వారి అభ్యున్నతికి తోడ్పడేలా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రస్తుత బడ్జెట్ ట్రైలర్​ వంటిదని, ఎన్నికల తర్వాత మరిన్ని సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు.

130 కోట్లకు పైబడి ఉన్న దేశ జనాభాకు ప్రస్తుత బడ్జెట్​ ఓ ఉద్దీపనలా పని చేయనుందని తెలిపారు మోదీ. నవ భారతావనికి ఉన్న సమున్నత లక్ష్యాన్ని గుర్తు చేసేవిధంగా ఉందని అభిప్రాయపడ్డారు.

" ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా 12 కోట్ల మందికి పైగా 5ఎకరాల వరకు ఉన్న రైతులకు ఆర్థిక సాయం అందించనున్నాం. స్వాతంత్ర్యానంతరం రైతుల కోసం రూపొందించిన గొప్ప పథకం ఇదే. మా ప్రయాస అంతా రైతులకు చేయూతనందించడం. వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం. అసంఘటిత రంగ కార్మికులు, ఇంటిపనిచేసే వారు, వ్యవసాయ కూలీల సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరూ పట్టించుకోలేదు. మనదేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య 42 కోట్ల పైనే ఉంది. ప్రధానమంత్రి మాన్​ధన్ యోజన ద్వారా వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇస్తాం. "

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ABOUT THE AUTHOR

...view details