వేతనజీవులకు భారీ ఉపశమనం
ఎన్నికల ముందు మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా మోదీ సర్కారు బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. ఆదాయ పన్ను పరిమితిని ఒకేసారి 5లక్షలకు పెంచింది. రూ.6.5లక్షల స్థూల ఆదాయం వచ్చేవారికి సైతం పన్ను మినహాయింపు దక్కేలా ప్రకటనలు చేసింది.
"ఇప్పటివరకు 2.5 లక్షలున్న ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని 5 లక్షలకు పెంచుతున్నాం. ప్రామాణిక మినహాయింపును రూ.40వేల నుంచి 50వేలు చేస్తున్నాం. ఈ ప్రతిపాదన ద్వారా 3 కోట్ల మంది మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ 18,500 కోట్ల లబ్ధి చేకూరనుంది. పన్ను ఆదా చేసే ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టిన వారి స్థూల ఆదాయం సంవత్సరానికి 6.5 లక్షల లోపుంటే.. వారిని సైతం ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయిస్తున్నాం. అదనంగా జాతీయ పింఛను పథకంలో పెట్టుబడి, వైద్య బీమా, గృహ, విద్యా రుణాలపై వడ్డీ ఎంత కడుతున్నా దానికి పన్ను కట్టాల్సిన పనిలేదు."
-- పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి