- పశ్చిమ బెంగాల్లో 200 మంది ప్రైవేటు వ్యక్తులు స్థాపించిన సంస్థే శారదా చిట్‌ఫండ్. పది లక్షల మందికి పైగా పెట్టుబడిదారులను మోసం చేసి ఏప్రిల్ 2013లో బయటపడింది.
- చిన్న మదుపుదార్లను ఆర్థికంగా రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 500కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
- 2013 ఏప్రిల్ 23న సంస్థ ఛైర్మన్, ఎండీ సుదీప్త సేన్‌తో పాటు దేబ్జని ముఖర్జీ, అరవింద్ సింగ్ చౌహాన్‌ను పోలీసులు కశ్మీర్లో అదుపులోకి తీసుకున్నారు.
- సుదీప్ సేన్ ఇందులో తృణముల్ ఎంపీలకు కుంభకోణంలో భాగస్వామ్యం ఉందంటూ పోలీసుల విచారణలో వెల్లడించారు.
- సుదీప్ సేన్ అరెస్టు అనంతరం సెబీ... మూలధనాన్ని మోసపోయిన వారికి 3 నెలల్లో ఇవ్వాలంటూ శారదా సంస్థకు నోటీసులు ఇచ్చింది.
- కుంభకోణం వెనుక పెద్దల హస్తం ఉందని ఆదాయపు పన్ను, ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి.
- మాజీ మంత్రి మంతన్ సింగ్ భార్యకు కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ప్రముఖ న్యాయవాది, చిదంబరం భార్య నళిని చిదంబరం వాదించింది. కేసు వాదనకు గాను నళిని రూ.1.26 కోట్ల శారద ధనం స్వీకరించిందని ఈడీ కేసు నమోదు చేసింది.
- శారద కుంభకోణంపై ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసానికి రాగా రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కొంత కాలం బంధించి విడుదల చేశారు.
- ఈ చర్యలపై పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్విర్యం చేస్తోందంటూ ఆదివారం రాత్రి ధర్నా చేపట్టారు.
ఇంతకీ శారద కుంభకోణం ఏంటి? - undefined
ఆదివారం కోల్‌కతా పోలీసు కమిషనర్ నివాసానికి సీబీఐ అధికారులు రావడం మొదలు పలు అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. మోదీ ప్రభుత్వంపై దీదీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా తన వ్యతిరేక శక్తులను అడ్డుకట్ట వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే శారదా చిట్‌ఫండ్ కుంభకోణాన్ని తిరిగి తెరిచింది. దీంతో శారద కుంభకోణం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
Sarada scam
TAGGED:
sarada scam