మౌనీ అమావాస్య రోజున పవిత్ర స్నానాలు అచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళాకు చేరుకున్నారు.
కుంభమేళా
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న కుంభమేళాకు భక్తజనం పోటెత్తారు. మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. రెండో షాహీ స్నానాల కోసం దేశ నలుమూలల నుంచి అలహాబాద్ చేరుకుంటున్నారు. ఈ ఒక్క రోజే మూడు కోట్లమంది భక్తులు పవిత్ర స్నానాల్లో పాల్గొంటారని అంచనా. రైల్వేస్టేషన్లు, ప్రయాణ ప్రాంగణాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
కుంభమేళా ఉత్సవంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మౌనీ అమావాస్య రోజుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు భక్తులు. మొదటి షాహీ స్నానాలు జనవరి 15 మకర సంక్రాంతి రోజున, మూడో షాహీ స్నానాలు వసంత పంచమి ఫిబ్రవరి 10న ఆచరిస్తారు భక్తులు.
జనసందోహం దృష్ట్యా అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కుంభ నగరిలో 40 పోలీసు స్టేషన్లతో సహా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేశారు.