ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం - వీసా కుంభకోణం
వీసాల దుర్వినియోగం ఆరోపణలపై అరెస్టయిన విద్యార్థులందర్నీఆదుకునేలా భారత విదేశాంగ శాఖ ముమ్మర చర్యలు చేపడుతోంది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను ఏర్పాటు చేసింది
![ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2358071-24-9cb97a9d-cb1d-4b2f-b7d0-8dff1db69869.png)
ప్రత్యేక నోడల్ అధికారుల నియామకం
అమెరికాలోని ఫార్మింగ్ టన్ నకిలీ వీసాల వివాదంలో అరెస్టయిన విద్యార్థులందర్నీ అన్ని విధాలుగా అదుకునేందుకు భారత విదేశాంగ అధికారులు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్) ఉన్న విద్యార్థులను పరామర్శించేందుకు దౌత్య అధికారులను పంపినట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్థన్ శృంగ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాల్లో నోడల్ అధికారులను నియమించటంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.