రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుని నుంచి లక్షా యాభై వేల రూపాయల విలువ చేసే 14 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అమరావతికి చెందిన అక్బర్ అనే వ్యక్తిపై అనుమానం కలగడం వల్ల నిందితుల్ని విచారించి తనిఖీ చేశారు. గంజాయిని గుర్తించినట్టు ఆర్పీఎఫ్ ఎస్ఐ రవిబాబు తెలిపారు. రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..