రాష్ట్రంలో సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని మాల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల విలువ రూ.8 కోట్లు ప్రకటించారని... 2018లో రూ.41 కోట్ల ఆస్తి పెరగటం వెనక రహస్యమేంటని ప్రశ్నించారు. తెరాసకు రూ.188కోట్ల విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి తండ్రీకొడుకులు వ్యక్తిగత ఆస్తులు సంపాదించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కేటీఆర్ చేపట్టిన శాఖలపై విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రిని, గవర్నర్ను, కోర్టును కొరనున్నట్లు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో కేటీఆర్ భూ కుంభకోణాలకు పాల్పడినట్లు ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు