పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుముప్పుగా మారింది. ప్లాస్టిక్ కవర్లు, సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార సంచుల తయారీపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని జనవికాస గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళలకు శిక్షణ ఇస్తోంది. మహిళలకు కుట్లు- అల్లికలు నేర్పిస్తున్న ఈ సంస్థ... ప్లాస్టిక్ భూతాన్ని పారద్రోలేందుకు వారికి జనపనార సంచుల తయారీపై ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు.
హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన 15 మంది మహిళలకు ఈ నెల 19న శిక్షణ ప్రారంభించారు. వారికి 23 రకాల బ్యాగులు కుట్టడం నేర్పించారు. ఇలా సంచుల తయారీపై శిక్షణ అందిస్తూ వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్