రెండుసార్లు మంత్రి అయిన కేటీఆర్, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన వివేక్‌లు నిజాంపేట్‌లో తాగునీరు, రోడ్ల సమస్యలు పరిష్కరించారా అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజాంపేట్ పరిధిలో ఈరోజు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.
గత అన్ని ఎన్నికల ప్రచారాల్లో అబద్ధాలు చెప్పిన కేటీఆర్, కేసీఆర్‌లకు... ప్రస్తుతం చెప్పేందుకు ఎలాంటి అబద్ధాలు దొరకట్లేదని, అందుకే వారు ప్రచారాలు చేయడానికి రావట్లేరని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే... ప్రభుత్వం మెడలు వంచి మరీ సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్రంతో పోట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు... స్థానిక నాయకత్వం అవసరమని తెలిపారు.
ఇవీ చూడండి: ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడితో పోలీసులకు తిప్పలు