ETV Bharat / state
బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్ - పురపోరు
హైదరాబాద్ శివారు జవహర్‌నగర్ నగరపాలక సంస్థగా మారినా... అభివృద్ధిలో పంచాయతీ కన్నా వెనుకబడే ఉంది. డంపింగ్‌యార్డు, తాగునీరు, రోడ్ల సమస్యతో కార్పొరేషన్‌లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్‌యార్డును తరలించాలని...అనేక ఉద్యమాలు చేసినా... పరిస్థితి మారలేదు. వ్యర్థాల వల్ల ఈగలు, దోమలు చేరి సమీపంలోని ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.
MUNICIPAL ELECTIONS IN JAVAHARNAGAR CORPORATION
By
Published : Jan 18, 2020, 2:20 PM IST
| Updated : Jan 18, 2020, 2:27 PM IST
బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్ భూకబ్జాలు, కూల్చివేతలు..
1995లో పంచాయతీగా ఏర్పడిన జవహర్‌నగర్...ఇటీవల నగరపాలక సంస్థగా ఏర్పడింది. కార్పొరేషన్‌లో 28 డివిజన్లు ఉండగా... వార్షిక ఆదాయం 12 కోట్లు వస్తోంది. గతంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతోపాటు... భూకబ్జాలు, కూల్చివేతలతో తరచూ వార్తల్లోకెక్కింది. ఈ నగరపాలక సంస్థలో వలస ఓటర్లే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. అనేక ప్రభుత్వాలు మారినా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజల బతుకులు మారలేదు. డంపింగ్‌యార్డు నుంచి వెలువడుతున్న విష రసాయనాలతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. వాతావరణం కాలుష్యమై పోవడం వల్ల చుట్టుపక్కల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వ్యర్థాల వల్ల వచ్చే దుర్గంధం వల్ల కాలనీల్లోకి వెళితే ముక్కుమూసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషరసాయనాల వల్ల నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జ్వరాలతో పాటు... దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.
మురికి కాలువలు..పేరుకుపోయిన చెత్తాచెదారం
నగరపాలక సంస్థలోని పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తచెదారం పేరుకుపోయింది. మురికి కాలువలు లేక నీరు నిలిచి...దోమలు, ఈగలు పెరిగిపోయాయి. కార్పొరేషన్‌లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. దూర ప్రాంతాలనుంచి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి నల్లాలు రావడం వల్ల... నీళ్ల కోసమే అధికంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో వెనకడుగు..
జవహర్‌నగర్ కార్పొరేషన్...అభివృద్ధిలో పంచాయతీకన్నా...దారుణమైన పరిస్థితిలో ఉంది. ప్రధాన రహదారులు గుంతలుగా మారడంతో... వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని సీసీ రోడ్లు కూడా లేక పట్టణవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన అనుమతుల వల్ల ఇబ్బందులు తలెత్తాయి. అంతర్గత రోడ్లు చిన్నగా ఉండడం వల్ల కాలనీల్లోకి అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
జవహర్‌నగర్ నగరపాలక సంస్థ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో... ఇక్కడ తీవ్ర పోటీ నెలకొంది. కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు, నేతలు అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు
బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్‌నగర్ కార్పొరేషన్ భూకబ్జాలు, కూల్చివేతలు..
1995లో పంచాయతీగా ఏర్పడిన జవహర్‌నగర్...ఇటీవల నగరపాలక సంస్థగా ఏర్పడింది. కార్పొరేషన్‌లో 28 డివిజన్లు ఉండగా... వార్షిక ఆదాయం 12 కోట్లు వస్తోంది. గతంలో జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతోపాటు... భూకబ్జాలు, కూల్చివేతలతో తరచూ వార్తల్లోకెక్కింది. ఈ నగరపాలక సంస్థలో వలస ఓటర్లే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. అనేక ప్రభుత్వాలు మారినా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజల బతుకులు మారలేదు. డంపింగ్‌యార్డు నుంచి వెలువడుతున్న విష రసాయనాలతో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. వాతావరణం కాలుష్యమై పోవడం వల్ల చుట్టుపక్కల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వ్యర్థాల వల్ల వచ్చే దుర్గంధం వల్ల కాలనీల్లోకి వెళితే ముక్కుమూసు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషరసాయనాల వల్ల నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జ్వరాలతో పాటు... దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నారు.
మురికి కాలువలు..పేరుకుపోయిన చెత్తాచెదారం
నగరపాలక సంస్థలోని పలు కాలనీల్లో మురుగు కాలువలు లేక స్థానికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెత్తచెదారం పేరుకుపోయింది. మురికి కాలువలు లేక నీరు నిలిచి...దోమలు, ఈగలు పెరిగిపోయాయి. కార్పొరేషన్‌లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. దూర ప్రాంతాలనుంచి నీటిని తెచ్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి నల్లాలు రావడం వల్ల... నీళ్ల కోసమే అధికంగా వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో వెనకడుగు..
జవహర్‌నగర్ కార్పొరేషన్...అభివృద్ధిలో పంచాయతీకన్నా...దారుణమైన పరిస్థితిలో ఉంది. ప్రధాన రహదారులు గుంతలుగా మారడంతో... వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలోని సీసీ రోడ్లు కూడా లేక పట్టణవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చిన అనుమతుల వల్ల ఇబ్బందులు తలెత్తాయి. అంతర్గత రోడ్లు చిన్నగా ఉండడం వల్ల కాలనీల్లోకి అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
జవహర్‌నగర్ నగరపాలక సంస్థ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో... ఇక్కడ తీవ్ర పోటీ నెలకొంది. కార్పొరేషన్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు, నేతలు అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు
TG_HYD_31_13_Attn_Munci_Javaharnagar_Corporation_Pkg_3182301
Reporter: Kartheek
() కాలనీగా మొదలై నగరపాలక సంస్థగా మారింది జవహర్ నగర్. స్థాయి మారినా.... మారుమూల తండా కన్నా అధ్వానంగా ఉంది అక్కడి పరిస్థితి. డంప్ యార్డుతో జవహర్ నగర్ చుట్టు పక్కల మొక్కలు కూడా మొలవడం లేదు.... ఉన్న మొక్కలు సైతం ఎండిపోతున్నాయి. కాలుష్యంతో నిత్యం ఇక్కడి ప్రజలు ఈగలు... దోమలతో దీర్ఘకాలిక రోగాల భారీన పడుతున్నారు. ఇప్పటికే పలువూరు మరణించగా.... ఈ కాలుష్య కారణంగా బోరు వేసినా పెట్రోల్ వలే నల్ల రంగులో నీరు వస్తోంది. మంచినీరు రాక..కాలుష్యపు నీరు తాగలేక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. తీవ్రమైన జ్వరాలతో పాఠశాలలకు సైతం వెల్లడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కిలో మీటర్ల మేర వాసన విస్తరిస్తుందని... డంప్ యార్డు ఇక్కడి నుంచి తరలించాలి స్థానికులు కోరుతున్నారు. ఇక వీటితో పాటు అనధికారిక నివాసాలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, రోడ్లు, బస్టాండ్లు, మురుగుల కాలువలతో పాటు కనీస అవసరాలు లేని జవహర్ నగర్ నగర పాలక సంస్థపై ఈటీవీ ప్రత్యేక కథనం. Look
వాయిస్ ఓవర్‌ః
పలు రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారితో విభిన్న సంస్కృతుల మేళవింపుగా జవహర్‌నగర్ ప్రత్యేకతను సంతరించుకుంది. 1990కి ముందు ఈ ప్రాంతంలో చెన్నాపురం, మల్కారం కుగ్రామాలు తూంకుంటకు అనుబంధంగా ఉండేవి. ఈ ప్రాంతమంతా ప్రభుత్వ, వ్యవసాయ భూములే.. ఆ సమయంలో ప్రభుత్వం ఇక్కడ విశ్రాంత సైనికులకు భూములను కేటాయించింది. ఆ భూములను వారు విక్రయించడంతో క్రమంగా కాలనీలు పెరిగాయి. 1995లో జవహర్‌నగర్ పేరుతో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. ఓ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామంగా మొదలై, మేజర్ పంచాయతీగా, పురపాలికగా రూపాంతరం చెంది, అంతలోనే నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. డంపింగ్ యార్డుతో పాటు.. విలువైన ప్రభుత్వ భూములకు కేంద్రంగా, భూకబ్జాలు, ఆక్రమణల కూల్చివేతలతో తరచూ వార్తలకెక్కింది. నగర పాలక సంస్థకు అనుబంధ గ్రామాలుగా చెన్నాపురం, మల్కారం, అరుంధతీనగర్, బాలాజీనగర్, బీజేఆర్‌నగర్, అంబేడ్కర్‌నగర్ ఉన్నాయి. కొంత మంది ఇక్కడి ప్రభుత్వ భూములకు పట్టాలు సృష్టించి వాటిని విశ్రాంత సైనికుల నుంచి కొనుగోలు చేశామంటూ ప్లాట్లు చేసి విక్రయిస్తూ స్థిరాస్తి వ్యాపారాన్ని విస్తరించారు. అప్పటి వరకు 20 కాలనీల వరకు ఉన్న పంచాయతీ అనధికారికంగా 100 కాలనీలకు పైగా విస్తరించింది. కానీ కబ్జాల గొడవలు, సెటిల్‌మెంట్లు నిత్యకృత్యంగా మారాయి. జవహర్ నగర్ మొత్తం 24.6 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో 86 కాలనీలు..17 వేల నివాసాలు ఉన్నాయి. లక్ష 80 వేల జనాభా ఉండగా... 72 వేల 995 మంది ఓటర్లు ఉన్నారు. మహిళ ఓటర్లు 36 వేల 130, పురుషులు 36 వేల 865 ఉన్నారు. నగర పాలక సంస్థలో 28 డివిజన్లు ఉండగా... వార్షిక ఆదాయం 12 కోట్ల రూపాయలు వస్తోంది.
వాయిస్ ఓవర్ః
ఇక్కడ వలస ఓటరర్లే అధికంగా ఉన్నారు. 72 వేలలో ఓటర్లలో 65 వేల మంది వలస ఓటర్లే. ఈ వలస ప్రభావం కార్పొరేషన్ లోని అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు, తూర్పు గోదావరి, కర్నూల్, ప్రకాశం జిల్లాల నుంచి ఇక్కడ స్థిరపడ్డారు. బిహార్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు ఇక్కడ విజయావకాశాలపై ప్రభావం చూపనున్నారు. అన్ని సంస్కృతులకు నిలయం జవాహర్ నగర్ కార్పొరేషన్. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారు నగర శివారు ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 1974 లో తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జవహార్ నగర్ కాలనైజేషన్ ను మాజీ సైనికుల కోసం ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆవిర్భవించిందే జవహార్ నగర్ గ్రామం. మాజీ సైనికులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ప్రజలు నివాసాలు ఏర్పరచుకుని జీవిస్తున్నారు.
వాయిస్ ఓవర్ః
ఎన్ని ప్రభుత్వాలు మారినా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రజల బతుకులు, వారి సమస్యలు కొంచెం కూడా మారటం లేదు. నగరానికి శివారులో ఉన్న జవహర్‌నగర్‌లో దాదాపు 350 ఎకరాల్లో డంపింగ్ యార్డ్‌ను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. మహానగరంలో రోజువారిగా దాదాపు 3500 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలను జవహర్‌నగర్ డంప్ యార్డులో డంప్ చేస్తున్నారు. ఈ డంప్ ద్వారా తలెత్తే సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జవహర్ నగర్ పరిసర ప్రాంతాలల్లో నివసిస్తున్న ప్రజలకు డంపింగ్ యార్డ్ శాపంగా మారింది. డంపింగ్ యార్డుతో వెలువడుతున్న విషపు రసాయనాలతో భూగర్భజలాలు, వాతావరణ కాలుష్యం పెట్రేగిపోతోంది. ఆ చుట్టూ పక్కల నివాసముంటున్న జనాలు నరకయాతన అనుభవిస్తున్నారు. డంపింగ్ యార్డుతో ఉత్పన్నమయ్యే సమస్యలపై జవహర్ నగర్ వాసులు దీర్ఘకాల పోరాటాలు చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడి నిల్వచేసే చెత్త నుంచి వెలువడుతున్న విషవాయువులు, భూగర్భజలాలను కలుషితం చేయడంతో అక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. డంప్‌యార్డుకు వ్యతిరేకంగా ప్రజలు అనేక పోరాటాలు, నిరసనలు చేస్తున్న కాలనీ వాసులను మభ్యపెట్టి... మాయమాటలు చెప్తూ నాయకులు కాలం వెల్లదీశారు. మాట వినని వారిపై కేసులు పెట్టడం, లేదంటే నాయనో బయనో ఇచ్చి వారినోరు మూయించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోడం నాయకులకు ఆనవాయితీగా వస్తోంది. డంపింగ్ చేసిన వ్యర్థ పదార్థాలతో సహజ వనరులను పునరుద్ధరించి, అక్కడి ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి కృషి చేసేందుకు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థతో కలిసి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. కానీ ఇందుకు భిన్నంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు కొన్ని దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూ, పబ్బం గడుపుతూ కాసులు కూడ బెట్టుకుంటున్నారు. వ్యర్థపదార్థాలతో సహజ వనరులను పునరుద్ధరణ చేసి కంపోస్ట్ ఎరువులను, ఆర్డీఎఫ్ (రెఫీస్ డిరైవ్డ్ ఫ్యూయల్) వంటి ఉత్పత్తులను తయారుచేస్తూ, యజమానులు, ప్రభుత్వాలు లబ్దిపొందుతున్నాయి. కానీ వాటి ద్వారా ఎదురయ్యే సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డంప్ యార్డు చుట్టూ ఉండే ప్రాంతాల్లోని గ్రామాలు దమ్మాయిగూడ, మల్కారం, అహ్మద్ గూడా, తిమ్మాయి పల్లి, చేర్యాల్, గబ్బిలాల పేట, వైఎస్‌ఆర్ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీ, రాజీవ్ స్వగహ, ఎంఎల్‌ఆర్ కాలనీ మొదలగు కాలనీల్లో పీల్చుకునే గాలి, తాగే నీరు కూడా కలుషితమవుతున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నారు. వింత రోగాలతో పసిపిల్లలు, వ ద్ధులు, గర్భిణీ స్త్రీలు నానాఅవస్థలు పడుతున్నా ప్రభ్యత్వాలు, ప్రయివేటు యాజమాన్యాలు కనిసం ఆ గ్రామాలవైపు కన్నెత్తి చూడకపోవడం దురదుష్టకరమని వాపోతున్నారు.
వాయిస్ ఓవర్ః
ఈ చెత్తతో జవహర్ నగర్ ప్రాంతంలో కిలోమీటర్ల వరకు దీని వాసనే ఉంటుంది. ఈ కాలనీల్లోకి వెళితే ముక్కుమూసు కోవాల్సిందే. ఇక అక్కడే ఉండే జనాలు మాత్రం ఎప్పుడు ఇంటి తలుపులు, కిటికిలు వేసుకుని ఉండాల్సిందే. పగటి పూఏట దోమలు... రాత్రి పూట తీవ్రమైన దోమలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు పక్కనే ఉండే శాంతినగర్ తో పాటు పలు బస్తీల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ కాలనీల్లో పగలైన రాత్రైనా అసలు ఎవరు ఇంటి తలుపులు తీయడం లేదు. ఈ డంపింగ్ యార్డు నంచి వచ్చే దుర్వాసనకు రోగాల భారీన పడి పలువూరు కాలనీ వాసులు మరణించినట్లు వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జ్వరాలతో పాటు... దీర్ఘకాలిక రోగాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. పలువూరు కాల్లు, చేతులు వంకర్ల పోవడం లాంటివి జరుగుతున్నాయని... పిల్లలు కూడా జ్వరాలతో పాఠశాలలకు సరిగా వెల్లడం లేదని చెబుతున్నారు. డంప్ యార్డు తో పాటు ఇక్కడికి చెత్తను తరించేందకు వేల సంఖ్యలో లారీలు వస్తుంటాయి వీటితో మరింత ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి సమయంలో ఇవీ ఎక్కువగా స్పీడ్ గా వెల్లడంతో.... ప్రమాదాలు జరిగి పలువూరు మరణించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఎంత డంపింగ్ యార్డును ఎంత మోడ్రన్ గా చేసినా...... లాభం లేదని వెంటనే డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు.
బైట్స్‌ః డంపింగ్ యార్డు కాలనీ వాసులు
వాయిస్ ఓవర్ః
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సారధ్యంలో జవహర్ నగర్ డంప్ యార్డును హైదరాబాద్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మెనేజ్‌మెంట్ ప్రయివేటు లిమిటెడ్ పేరుతో కొత్త వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇందులోభాగంగా డంప్ యార్డును సుందరీకరించడానికి క్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యర్థపదార్థాలను వేరు చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పవర్ ప్లాంట్లో విద్యుత్, ప్లాస్టిక్, కంపోస్ట్ ఎరువులను, ఆర్డీఎఫ్ వంటి ఉత్పత్తులపై దష్టి సారిస్తున్నారు. క్యాపింగ్ ప్రక్రియ దశల వారిగా మొదలై, గతేడాది పూర్తిస్థాయిలో అభివద్ధి చేస్తామని హామీ లు ఇచ్చారు. డంపింగ్ యార్డ్ నుంచి కిలో మీటర్ దూరం వరకు నివాస యోగ్యం లేకుండా, అక్కడి ప్రజలకు దాదాపు నాలుగు వందల డబుల్ బెడ్‌రూంలు ఏర్పాటు చేస్తామని నాయకులు ప్రకటించి, చేతులు దులుపుకొన్నారు.
వాయిస్ ఓవర్ః
జవహర్ నగర్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ కన్నా హీనంగా ఉంది. మెయిన్ రోడ్డుకు అనుకుని ఉన్న రోడ్లు సైతం... సీసీ రోడ్డు లేక...కేవలం మట్టితో నే దర్శనమిస్తున్నాయి. ఇక మరికొన్ని రోడ్లతే ఇరుకు ఇరుకుగా ఉన్నాయి. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఎడా పెడా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడు పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి. పలు కాలనీల్లో మురుగు కాలువలు రోడ్ల పైనే నీరు పారుతోంది.... దీంతో రోడ్లపై జనాలు నడువలేకపోతున్నారు. మరోవైపు నీరు నిలవడంతో దోమలు తయారై..... రోగాల భారీన పడుతున్నారు. ఇక పలు కాలనీల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. రెండు, మూడు రోజులకు ఒకసారి నీరోస్తుందని..... తాగునీటి కోసం నెలకు వందల్లో ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు. పలు కాలనీల్లో వీధి లైట్లు వెలగడం లేదని...
బస్టాండ్ లేక ప్రయాణికులు చెట్ల కిందే వేచిఉంటున్నారు. వీరభద్ర కాలనీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది మంచినీరు, విద్యుత్ సౌకర్యం లేక కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చంద్రపురి కాలనీలో వికలాంగుల కాలనీ రోడ్డు మరింత అధ్వానంగా ఉంది.
బైట్స్‌ః ప్రజలు
వాయిస్ ఓవర్ః
జవహర్ నగర్ నగర పాలకసంస్థ మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ తెరాస నుంచి మంత్రి మల్లారెడ్డి తన అనుయరులకు మేయర్ స్థానాన్ని కైసవం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పికే బహిరంగ ఏర్పాటు చేసి ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నియోజికవర్గం కావడంతో....ఇక్కడ ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం తన అనుచరులను గెలిపించుకునేందుకు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే తెరాస రెబెల్ అభ్యర్థులకు కాంగ్రెస్ పిలిచి పోటీ చేయిస్తున్నారు. ఈ కార్పొరేషన్ లో భాజపా నేతలు....పెద్దగా కనబడంట లేదు... ఇక్కడ పోటీ తెరాస, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నిహారిక, బీటెక్ విద్యార్థి కావ్య లు తెరాస మేయర్ అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఎండ్.....
Last Updated : Jan 18, 2020, 2:27 PM IST