ప్రధాన పార్టీల ఫోకస్...
దుండిగల్ మున్సిపాలిటీకి జనరల్ మహిళ రిజర్వేషన్ కేటాయించగా... అన్ని ప్రధాన పార్టీలు గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఛైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతుండగా... తెరాస ఎత్తుగడలను చిత్తు చేసి విజయం సాధించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. స్థానిక నేతలు మున్సిపాలిటీలను గెలిపించుకు రావాలని సీఎం కేసీఆర్ ఆదేశించి దృష్ట్యా... కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంబిపూర్రాజు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పావులు కదుపుతున్న ప్రతిపక్షాలు...
అధికార పార్టీ వైఫల్యాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా హస్తం నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఎంపీ రేవంత్రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ వ్యూహాలు రచిస్తున్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తూ... యువతను ఉత్తేజపరుస్తున్నారు రేవంత్రెడ్డి. మరోవైపు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి స్వస్థలం కావటం వల్ల... తన ప్రాభల్యం చూపించుకుని సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
అభివృద్ధి అంతంతమాత్రమే...
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల కబ్జా అంశాన్ని ప్రతిపక్షాలు ప్రచారానికి వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పురపాలికలో ప్రధానంగా ఆదాయ వనరులు లేకపోవటం వల్ల....అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. కొత్తగా వేస్తున్న వెంచర్లు భవన నిర్మాణ అనుమతులే ప్రధాన ఆదాయాలుగా ఉన్న ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి చేసే నాయకునికే తమ ఓటంటున్నారు స్థానికులు.
ఇవీ చూడండి: పురపోరుకు సై అంటున్న రియల్టర్లు