కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కాగజ్ నగర్ ఠాణాలో ఎస్పీ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు.
నిందితుడి వద్ద నుంచి 8 తులాల బంగారం, 31 తులాల వెండి, 15 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సిర్పూర్ టీ మండలానికి చెందిన దుర్గం ప్రేమ కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
ఇవీ చూడండి : తండా యువతిపై అత్యాచారం..!