ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ తండాకు చెందిన యువతిని సమీప గ్రామానికి చెందిన శ్రీకాంత్ పరిచయం చేసుకొని... శారీరకంగా లోబరుచుకున్నాడు. పలుమార్లు ఆమెను రహాస్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితురాలి చరవాణికి అసభ్యకర సంక్షిప్త సమాచారం పంపండాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. ఇదేంటని ప్రశ్నించగా... తనను బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ వీరస్వామి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణం కేసులో మరొకరి అరెస్టు