జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలికపై భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాచ కొమురయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొమురయ్య స్వయానా బాలికకు పెదనాన్న అవుతాడని పేర్కొన్నారు. నిందితుడి తమ్ముడు చిన్నారి తల్లితో సహజీవనం చేయగా ఈ బాలిక జన్మించింది.
తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్ధరణ పరీక్షల నిమిత్తం చిన్నారిని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారన్నారు.
ఇవీ చూడండి:ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!