గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 'సేవ్ నేషన్- సేవ్ కాన్‌స్టిట్యూషన్' పేరిట ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ ర్యాలీ కోసం రెండ్రోజుల క్రితమే పోలీసుల అనుమతిని కోరినప్పటికీ వారు అనుమతించలేరు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించగా.... పోలీసులు వారిని బయటకు రానీయకుండా అడ్డుకుంటున్నారు.
గాంధీ భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ ఒక్క నేతను కూడా బయటకు రానీయకుండా చర్యలు తీసుకున్నారు. గాంధీ భవన్ రెండు ప్రధాన గేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎవరు బయటకు వచ్చినా అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున వాహనాలను సిద్ధం చేశారు.
పోలీసులు తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరంగ ర్యాలీని అడ్డుకుంటున్నందున గాంధీభవన్‌లోనే కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. కుంతియా, ఉత్తమ్, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు 24 గంటలపాటు సత్యాగ్రహ దీక్ష కొనసాగించేందుకు నిర్ణయించుకున్నారు.
ఇవీ చూడండి: ఆ విద్యార్థినులు గర్భం దాల్చడానికి ఎవరు కారణం?