ETV Bharat / state

సంక్రాంతికి సంసిద్ధం: జనవరి 10 నుంచి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ సారి 6 కోట్ల ఆదాయం అర్జించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సుమారు 4940 ప్రత్యేక బస్సులను నడపనున్నామని హైదరాబాద్ ఆర్​ఎం వరప్రసాద్ తెలిపారు.

'ఆ 1100 ప్రత్యేక రిజర్వేషన్ల బస్సులకే అదనపు ఛార్జీలు'
'ఆ 1100 ప్రత్యేక రిజర్వేషన్ల బస్సులకే అదనపు ఛార్జీలు'
author img

By

Published : Dec 26, 2019, 5:58 PM IST

'ఆ 1100 ప్రత్యేక రిజర్వేషన్ల బస్సులకే అదనపు ఛార్జీలు'

సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. పండుగకు 4940 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్‌ వరప్రసాద్ వెల్లడించారు. జనవరి 10 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్​ల నుంచి ఏపీతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల ఆపరేషన్ ఉంటుందని ఆర్‌ఎం పేర్కొన్నారు. గతేడాది 4600 బస్సులను నడపగా 5 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ ఏడాది 6 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని వరప్రసాద్ తెలిపారు.

'అంతర్రాష్ట్ర బస్సులకే అదనపు ఛార్జీలు'

ఇంటర్ స్టేట్ సర్వీసులకు మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని... అందులోనూ రిజర్వేషన్ గల 1100 ప్రత్యేక బస్సులకే ఈ పెంపు వర్తిస్తుందని ఆర్‌ఎం స్పష్టం చేశారు. ఏపీతో పాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు 1526 బస్సులు నడిపిస్తామన్నారు. విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ పట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపూర్, కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామురు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను సిద్ధం చేసినట్లు వరప్రసాద్ వివరించారు.

నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి బస్సులు...

జనవరి 10న 965, 11న 1463, 12న 1181, 13న 1152 బస్సులు నడపనున్నామని వెల్లడించారు. నగరంలోని మహాత్మ గాంధీ, జేబీఎస్‌, సీబీఎస్, దిల్‌సుఖ్ నగర్, శేరి లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్​నగర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్‌, ఈసీఐఎల్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్, ఎల్‌బీనగర్‌ తోపాటు నగర శివారల్లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి బస్సులు నడిపిస్తామని ఆర్​ఎం చెప్పుకొచ్చారు.

తేదీ బస్సుల సంఖ్య
జనవరి 10 965
జనవరి 11 1463
జనవరి 12 1181
జనవరి 13 1152

ఇవీ చూడండి : జనవరి 1నుంచి ఆర్టీసీ కార్గో బస్సులు

TG_Hyd_33_26_RTC_Sankranthi_Busses_Arrengements_AB_3182388 Reporter: Sripathi Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) సంక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్దమైంది. పండుగకు 4940 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్‌ వరప్రసాద్ వెల్లడించారు. జనవరి 10నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని వరప్రసాద్ మీడియా ముందు వివరించారు. హైదరాబాద్, సికిందరాబాద్ ల నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సుల ఆపరేషన్ ఉంటుందని ఆర్‌ఎం పేర్కొన్నారు. గతేడాది 4600బస్సులు నడుపగా 5కోట్ల ఆదాయం వచ్చిందని...ఈ ఏడాది 6కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని వరప్రసాద్ తెలిపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3414 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ స్టేట్ సర్వీసులకు మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఆర్‌ఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని బెంగళూరు, చెన్నయ్‌ వంటి నగరాలకు 1526 బస్సులు నడిపిస్తామన్నారు. విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు,తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ పట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపూర్, కర్నూల్‌, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందూకూరు, పామురు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వరప్రసాద్ వివరించారు. జనవరి 10వ తేదీన 965, 11న 1463, 12వ తేదీన 1181, 13వ తేదీన 1152బస్సులు నడిపనున్నట్లు వెల్లడించారు. నగరంలోని మహాత్మగాంధీ, జేబీఎస్‌, సీబీఎస్,దిల్‌సుక్‌నగర్,లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్ నగర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్‌, ఈసీఐఎల్, ఉప్పల్‌ క్రాస్‌ రోడ్, ఎల్‌బీనగర్‌తోపాటు నగర శివారల్లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి బస్సులు నడిపిస్తామని వరప్రసాద్ వివరించారు. వరప్రసాద్ : రంగారెడ్డి రీజినల్ మేనేజర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.