రాష్ట్రపతి శీతాకాల విడిదికి సర్వం సిద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు హకీంపేట రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌లోని హకీంపేట చేరుకుంటారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలకుతారు. ఈనెల 21, 22 తేదీల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేస్తారు. 22న రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. 23 నుంచి 26 వరకూ చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో పర్యటిస్తారు. 26న తిరిగి మళ్లీ హైదరాబాద్ చేరుకుంటారు. 27న రాష్ట్రపతి నిలయంలో కోవింద్ తేనీటి విందు ఇస్తారు. 28న మధ్యాహ్నం 3.15కి దిల్లీ బయలుదేరి వెళతారు.
భద్రత కట్టుదిట్టం...
రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బొల్లారం పీఎస్‌తోపాటు నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, బేగంపేట్ ఏసీపీ, కేంద్ర బలగాలు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సీపీ అంజనీ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అధికారులతో సమీక్షించారు.
ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు