ETV Bharat / state

పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్.. - tsplrb latest updates

హుందాతనం... చేతిలో లాఠీతో... ఠీవీగా ఉద్యోగం... చేయాలంటే యువతకు ఎంతో మోజు. అందుకే పోలీసు ఉద్యోగాలకు మాంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల కొందరు యువకులు పోలీసు ఉద్యోగం అంటేనే మాకొద్దు బాబోయ్‌ అంటూ హడలెత్తుతున్నారు. ఎంతో శ్రమించి పరీక్షలు రాసి, పరుగుపందాల్లో పాల్గొని ఎంపికయ్యాక ఈ కొలువు మాకొద్దు బాబోయ్​ అంటూ వెనక్కి తగ్గుతున్నారు. కానిస్టేబుల్‌ శిక్షణ మొదలయిన పది రోజుల్లోనే 50 మంది తాము ఉద్యోగం చేయలేమంటూ వెళ్లిపోయారు. వచ్చిన ఉద్యోగాన్ని వదిలేసి పోతున్న తీరు అధికారులను నివ్వెరపరుస్తోంది.

Police
పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..
author img

By

Published : Jan 31, 2020, 6:16 AM IST

Updated : Jan 31, 2020, 7:28 AM IST

పోలీస్ కొలువు మాకొద్దు బాబోయ్..

ఇటీవల కాలంలో పోలీసు ఉద్యోగాల పట్ల యువతలో ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలో మొత్తం 16,295 కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి ప్రకటన జారీ చేసింది. దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

పోలీసు ఉద్యోగాలంటే డిమాండ్‌ ఎక్కువ ఉండగా.. దానికి తగ్గట్టుగానే దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ రాత, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయిన తర్వాత 13,690 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 17న వీరికి శిక్షణ ప్రారంభమైంది. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 1,370 మంది గైర్హాజరయ్యారు. వీరిలో 500 మంది మాత్రమే తమకు ఈ ఉద్యోగం ఇష్టం లేదని లిఖితపూర్వకంగా తెలిపారు.

ఉద్యోగం నచ్చలేదని..

మిగతా వారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శిక్షణకు హాజరు కాలేదు. ప్రతిసారి ఇటువంటి పరిణామాలు మామూలే... అయితే ఈసారి గైర్హాజరయిన వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉందని అధికారులు సరిపెట్టుకుంటున్నా... మరో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం శిక్షణలో ఉన్నవారు కూడా ఈ ఉద్యోగం నచ్చలేదని చెప్పి వెళ్లిపోతుండడం.. ఉన్నతాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఇపుడే ఇలా ఉంటే.. చివరకు..

రాష్ట్రంలో మొత్తం 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభమైంది. మొత్తం మీద ప్రతిరోజు ముగ్గురు నుంచి నలుగురు ఇలా గైర్హాజరవుతున్నట్టు తెలుస్తోంది. శిక్షణ ప్రారంభంలోనే ఇలా ఉంటే... తొమ్మిది నెలల పాటు కొనసాగే శిక్షణలో చివరి వరకు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు.

10వేలైనా భర్తీ అవుతాయా?

ఈ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఖాళీగా మిగిలే అవకాశాలున్నాయి. తిరిగి వీటిని భర్తీ చేయాలంటే మరోసారి ప్రకటన ఇచ్చి అనేక దశల్లో పరీక్షలు నిర్వహించాలి. 16 వేలకు పైగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా... చివరకు 10 వేలైనా భర్తీ అవుతాయా అనేది సందేహంగా మారింది.

ఇవీ చూడండి: హత్య కేసు నిందితుడి చెరలో 20మంది చిన్నారులు!​

Last Updated : Jan 31, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.