ETV Bharat / state

ఖాతాలో నుంచి డబ్బులు పోయాయని నర్సు ఆత్మహత్య - SUICIDE NEWS IN HYDERABAD

హైదరాబాద్​ ఎస్సార్​ నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ నర్సు ఆత్మహత్య చేసుకుంది. తన చరవాణి నుంచి కుటుంబసభ్యులకు డబ్బులు పంపించేందుకు ప్రయత్నించగా... వేరే ఖాతాలోకి వెళ్లటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది.

NURSE SUICIDE AT SR NAGAR FOR MONEY TRANSFER TO ANOTHER ACCOUNT
NURSE SUICIDE AT SR NAGAR FOR MONEY TRANSFER TO ANOTHER ACCOUNT
author img

By

Published : Jan 3, 2020, 9:05 AM IST

తన బ్యాంకు ఖాతా నుంచి నగదువేరే ఖాతాకు వెళ్లినందుకు మనస్థాపం చెందిన ఓ నర్సు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. మేఘాలయకు చెందిన రీటా(32) జీవనోపాధి నిమిత్తం ఏడాదిన్నర కిందట నగరానికి వచ్చింది. బేగంపేట్​లోని నైటింగేల్ హోంఫర్ హెల్త్ కేర్ సర్వీస్​లో నర్స్​గా విధులు నిర్వహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో వృద్దులకు సేవలు అందించడం కోసం నైటింగేల్ సంస్థ తమ వద్ద ఉన్న నర్సులను పంపిస్తూ ఉంటుంది.

తనకు వచ్చిన వేతనాన్ని బ్యాంక్​లో జమ చేసుకుంటుంది రీటా. ఇటీవల తన చరవాణిలో డబ్బును కుటుంబసభ్యులకు పంపేందుకు ప్రయత్నించగా... పొరపాటున వేరే ఖాతాలో జమయ్యాయి. డబ్బులు గల్లతవ్వటం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన రీటా... ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

రీటాకు చాలా తక్కువ వేతనం వచ్చేదని... తనకు లోకజ్ఞానం అంతగా లేదని డైరీలో రాసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఖాతాలో నుంచి డబ్బులు పోయాయని నర్సు ఆత్మహత్య

ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్​తో రైతు మృతి

TG_HYD_05_03_NURSE_SUSIDE_AV_TS10021 Contributor : raghu (sanathnagar) cell : 9490402444 Note : విజువల్స్ డెస్క్ వాట్స్ అప్ కు పంపించాను. ( ) తన బ్యాంకు ఖాతా నుంచి నగదు గల్లంతు అవ్వడంతో మనస్థాపం చెందిన ఓ నర్సు తాను పనిచేస్తున్న ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మేఘాలయ రాష్ట్రానికి చెందిన రీటా(32) జీవనోపాధి నిమిత్తం ఏడాదిన్నర కిందట నగరానికి వచ్చి బేగంపేట్ లోని నైటాంగిల్ హోంఫర్ హెల్త్ కేర్ సర్వీస్ లో నర్స్ గా పనిచేస్తుంది. వివిధ ప్రాంతాల్లో వృద్దులకు సేవలు అందించడం కోసం నైటాంగిల్ సంస్థ తమ వద్ద ఉన్నటువంటి నర్సులను పంపిస్తుంది. అమీర్ పేట్ కు చెందిన కుల్ శ్రేష్ట్ అనే వ్యక్తి తన వృద్దురాలైన తన తల్లికి సేవ చేయడం కోసం ఈ సంస్థను సంప్రదించారు. దీంతో రీటా అతని తల్లికి సేవలు అందించడం కోసం వెళ్లింది. ప్రతినెల తన వేతనాన్ని రీటా బ్యాంక్ లో జమచేస్తుంటుంది. అయితే ఇటీవల తన ఖాతాలో నగదు గల్లంతు అవ్వడంతో రీటా మనస్థాపం చెందింది. తను తన చరవాణి ద్వారా తన కుటుంబసభ్యులకు డబ్బు పంపబోయి పొరపాటున వేరే ఖాతాలోకి మళ్లించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే రీటా చేసిన పనికి వేతనం చాలా తక్కువ అని తనకు లోకజ్ఞానం అంతగా లేదని ఈవిషయాన్ని తాను డైరీలో రాసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.