ETV Bharat / state

'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'

author img

By

Published : Dec 20, 2019, 4:27 PM IST

Updated : Dec 20, 2019, 10:48 PM IST

భవన నిర్మాణ అనుమతుల కోసం నూతన పురపాలక చట్టాన్ని తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా.. అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు.

'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'
'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'
'అత్యంత పారదర్శకంగా నూతన పురపాలక చట్టం'
భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాన్ని త్వరలో తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు చేస్తామన్నారు. హైదరాబాద్​​ బుద్ధ భవన్​లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశం జరిగింది. ఈ భేటీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సెల్ఫ్​ డిక్లరేషన్​, సింగిల్​ విండో పద్ధతుల్లో..

దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా కొత్త విధానం ఉంటుందని మంత్రి అన్నారు. టీఎస్ ఐపాస్ మాదిరే నూతన భవన నిర్మాణ అనుమతులు విధాన రూపకల్పన జరుగుతోందని.. సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తామన్నారు. నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు అనుమతులు తీసుకున్నా.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేతలు తప్పవని హెచ్చరించారు.

నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందిదేనని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపైన నూతన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఖాళీల భర్తీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

TG_HYD_38_20_New_Muncipal_Act_Soon_Ktr_AV_3182301 Reporter: Kartheek నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ () భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాన్ని త్వరలో తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు చేస్తామని చెప్పారు. బుద్ధభవణ్ లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ర్టస్ధాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది సమావేశం నిర్వహించారు. సమావేశానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, హైదరాబాద్ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం తీసుకోస్తామని మంత్రి అన్నారు. టీఎస్ ఐపాస్ మాదిరే నూతన భవన నిర్మాణ అనుమతులు విధాన రూపకల్పన జరుగుతోందని...సెల్ఫ్ డిక్లరేషన్, సింగిల్ విండో పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తామన్నారు. నూతన విధానాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు అనుమతులు తీసుకున్నా.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేతలు తప్పవన్న హెచ్చరించారు. నూతన విధానాన్ని అమలు చేసే బాధ్యత టౌన్ ప్లానింగ్ సిబ్బందిదేనని...నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన నూతన చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని ఖాళీల భర్తీ, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండ్....
Last Updated : Dec 20, 2019, 10:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.